శ్రద్దా కపూర్ కి సౌత్ పై మనసయ్యిందట

Published on Jun 19, 2019 11:00 pm IST

ఒకప్పుడు శ్రద్దా కపూర్ తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని పేరు. కానీ ప్రభాస్ తో’ సాహో’ మూవీలో ఆమె జట్టుకట్టాక తెలుగుతో పాటు దాదాపు సౌత్ మొత్తం శ్రద్దా పేరు సుపరిచితమైది. ఇటీవల విడుదలైన ‘సాహో’ టీజర్ కు అద్భుత ఆదరణ దక్కించుకొంది.యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ దక్కించుకుంది.
ఐతే ఈ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ చూసిన శ్రద్దా కపూర్ సినిమా హీరో లకు సౌత్ ఆడియన్స్ ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలిసింది, ఇకపై నేను సౌత్ లో ఎక్కువ సినిమాలు చేయాలని అనుకుంటున్నాను, ముఖ్యంగా తెలుగులో నటించాలని అనుకుంటున్నాను అని అన్నారు.

అందుకే సాహో మూవీ కొరకు తన పాత్రకు తానే స్వయంగా తెలుగు డబ్బింగ్ చెప్పుకుంటున్నారట. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాలు ఫ్యాన్స్ తో పంచుకున్నారు, శ్రద్దా కపూర్.

సంబంధిత సమాచారం :

More