సాహో భామ విజ్ఞప్తి వినండి.

Published on Aug 30, 2019 10:19 pm IST

భారీ అంచనాల మధ్య సాహో మూవీ నేడు విడుదలైంది.దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర హంగామా చేస్తున్నారు. భారీ కట్ ఔట్స్ పెట్టి వాటికి పూలమాలలు వేయడం, పాలాభిషేకాలు చేయడం చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటించడం జరిగింది. క్రైమ్ బ్రాంచ్ లో పనిచేసే పోలీస్ ఆఫీసర్ గా ఆమె కీలక పాత్ర చేయడం జరిగింది.

ఐతే శ్రద్దా మూవీ అభిమానులకు ఒక విజ్ఞప్తి చేశారు. సాహో చిత్రాన్ని కేవలం థియేటర్లలోనే చూడండి, పైరసీ వీడియో చూడొద్దని కోరుకున్నారు. రెండేళ్లు ఎంతో కస్టపడి ఈ చిత్రం చేశామని, మా కష్టం తెరపై చూడండి అన్నారు. ఎవరో చెప్పిన మాటలు వినకుండా మూవీని థియేటర్ లో చూసి ఆనందించండి అని విన్నవించుకున్నారు. చిత్రం పూర్తయితే యూనిట్ ముఖం కూడా చూడని తారలు ఉన్న ఈ రోజులలో శ్రద్దా ఈ మూవీ ప్రమోషన్స్ లో విరివిగా పాల్గొన్నారు.

సంబంధిత సమాచారం :