ఓజి సెట్స్‌కు వచ్చిన బ్యూటీ.. ఎవరంటే?

ఓజి సెట్స్‌కు వచ్చిన బ్యూటీ.. ఎవరంటే?

Published on May 14, 2025 1:13 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు సుజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘ఓజి’ కూడా ఒకటి. ఈ సనిమా షూటింగ్‌ను మేకర్స్ తాజాగా తిరిగి ప్రారంభించారు. దీంతో పవన్ అభిమానులు ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే, తాజాగా ఈ చిత్ర సెట్స్‌లో నటి శ్రియా రెడ్డి కూడా జాయిన్ అయ్యింది. ఆమె తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌లో పాల్గొంటుందని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఆమెది పవర్ఫుల్ పాత్ర అని తెలుస్తోంది.

ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు