ఇంకో 20 సినిమాలు చేశాకే, పిల్లల గురించి ఆలోచిస్తానంటున్న స్టార్ హీరోయిన్ !

ఇంకో 20 సినిమాలు చేశాకే, పిల్లల గురించి ఆలోచిస్తానంటున్న స్టార్ హీరోయిన్ !

Published on Jun 20, 2018 10:34 PM IST


తెలుగులో ‘ఇష్టం’ చిత్రంతో అరంగేట్రం చేసిన హీరోయిన్ శ్రియ అప్పటి నుంచి సినిమాలు చేస్తూనే ఉంది. కెరీర్ మొద‌లుపెట్టినప్పుడు ఎలా ఉందో ఇప్పటికి అదే గ్లామర్ ను మెయిన్ టెన్ చేస్తూ.. హీరోయిన్ గానే కొనసాగుతుంది. శ్రియతో కెరీర్ మొదలు పెట్టిన మిగతా హీరోయిన్లు పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కనేసి లైఫ్ లో సెటిల్ అయిపోయారు. కానీ శ్రియ మాత్రం ఇటీవలే తన రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ కొశ్చేవ్‌ను వివాహం చేసుకుంది. ఇక సినిమాలకి గుడ్ బై చెబుతుందనుకుంటే మళ్ళీ సినిమాలు అంగీక‌రిస్తూ తన హీరోయిన్ కెరీర్‌ ను కొన‌సాగిస్తోంది.

శ్రియ మీడియాతో మాట్లాడుతూ పెళ్లి చేసుకున్నంత మాత్రాన వెంటనే పిల్లల్ని కని ఇంటికి ప‌రిమిత‌మైపోవాల్సిన అవసరం లేదు. నేను ఇంకో ఇరవై సినిమాలైనా చేయాలి. నాకోసం రచయితలు దర్శకులు కొన్ని పాత్రలను సృష్టిస్తున్నారు. కాబ‌ట్టి నేను న‌ట‌న‌ను ఇప్ప‌ట్లో ఆపాల్సిన అవసరం నాకు రాదు. పిల్ల‌ల గురించి ఇప్పుడేం ఆలోచించట్లేదు. కనీసం మరో ఇరవై సినిమాలు చేశాకే, పిల్లల గురించి ఆలోచిస్తానని శ్రియ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు