తమిళంలో విశాల్ సరసన శృతి హాసన్ నటిస్తున్న ‘పూజై’ సినిమా క్లైమాక్స్ షూటింగ్ రేపటి నుండి హైదరాబాద్లో ప్రారంభం అవుతుంది. ప్రధాన తారాగణంపై గోల్కొండ కోటలో క్లైమాక్స్ సన్నివేశాలు తెరకేక్కిస్తారు. దీంతో టాకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అవుతుంది. మిగిలిన రెండు పాటల చిత్రీకరణ త్వరలో మొదలుపెడతారు. ఒక పాటను స్విట్జర్లాండ్ లో షూట్ చేయనున్నారు. దర్శకుడు హరి ఈ సినిమాను కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు.
తెలుగులో ‘పూజ’ పేరుతో ఈ సినిమాను అనువదిస్తున్నారు. సత్యరాజ్, రాధికా శరత్ కుమార్, ముకేష్ తదితరులు నటిస్తున్న ‘పూజై’లో రాజకీయ నాయకుడు, బిహార్ రాష్ట్ర ఆర్ట్స్, కల్చర్ & యూత్ అఫైర్స్ మినిస్టర్ వినయ్ బిహారీ కీలక పాత్రలో నటిస్తున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. విశాల్ సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుంది. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.


