శ్రుతిహాసన్ తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయ్యిపోయిందా.!

Published on Apr 26, 2019 2:00 pm IST

విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరోయిన్ శృతి హాసన్. తన తండ్రిలాగే మంచి నటనతో పాటు ఇతర రంగాలలో కూడా శృతి హాసన్ కు మంచి పట్టు ఉండడంతో మల్టీటాలెంటెడ్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

అయితే ఆమెకు లండన్ కు చెందిన నటుడు మరియు రచయిత మిచెల్ కోర్సల్ అనే వ్యక్తితో గత రెండేళ్ల నుంచి ప్రేమలో ఉన్నట్టు అనేక పుకార్లు వచ్చాయి. కానీ శృతి ఆ వార్తలు నిజమని ఎప్పుడు వెల్లడించలేదు. కానీ తాజాగా ఈ ఇద్దరి మధ్య ఉన్న బంధానికి ఎండ్ కార్డు పడిందని తేలిపోయింది.

దీనిపై వివరణ ఇస్తూ మిచెల్ కోర్సల్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మేము ఇద్దరం కొన్ని కారణాల చేత విడిపోయామని స్పష్టం చేసారు.

సంబంధిత సమాచారం :