‘లాభం’ కోసం శ్రుతి హాసన్ ‘విజయ్ సేతుపతి’తో.. !

Published on Apr 23, 2019 3:00 am IST

కమల్ హాసన్ కుమార్తెగా సినీలోకానికి పరిచయమైన శ్రుతి హాసన్ మొదటినుంచి గాయనిగా, సంగీత దర్శకురాలిగా, నటిగా ఇలా తనలోని మల్టీటాలెంటెడ్ పర్సన్ ని అప్పుడప్పుడు ప్రేక్షకులకు పరిచయం చేస్తూనే వచ్చారు. కొన్ని నెలలు క్రితం ‘ఐసిడ్రో మీడియా’ అనే సొంత నిర్మాణ సంస్థను కూడా శ్రుతి హాసన్ ప్రారంభించింది. అయితే ఆమె ఎన్ని చేసినా ఇంకా ఆమెను హీరోయిన్ గానే చుస్తున్నారు ప్రేక్షకులు.

అందుకేనేమో ఆమె మళ్లీ హీరోయిన్ గా కనిపించడానికి రెడీ అయ్యారు. 2017 సంవత్సరం తర్వాత ఆమె వెండితెర పై కనిపించలేదు. ఎప్పుడో తమిళ్‌ లో ‘సింగం3’, తెలుగులో ‘కాటమరాయుడు’, హిందీలో ‘బెహెన్ హోగీ తేరి’ సినిమాల్లోనే చివరగా నటించింది.

కాగా మళ్లీ రెండున్నర సంవత్సరాల తరువాత విజయ్ సేతుపతి హీరోగా ఎస్‌పీ జననాథన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లాభం’ సినిమా హీరోయిన్ గా నటించడానికి అంగీకరించింది. ఇక ఈ చిత్రం ఈ రోజే పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది.

ఈ విషయం గురించి శ్రుతి హాసన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. ‘‘నాకెంతో ఇష్టమైన నటీనటులతో నా కొత్త సినిమా ప్రారంభించాను. చాలా ఎక్సయిటింగ్‌ గా ఉంది. చాలా పాజిటివ్‌గా సరదాగా అనిపిస్తోంది’’ అని తెలిపింది.

సంబంధిత సమాచారం :