శృతి హాసన్ కి హాలీవుడ్ ఛాన్స్

Published on Jun 19, 2019 10:00 pm IST

పరిశ్రమలో వరుసల సినిమా అవకాలు వస్తున్న సమయంలోనే ఒక్కసారిగా సినిమాలు చేయడం మానేసి అందరికి షాక్ ఇచ్చింది శృతిహాసన్. ప్రియుడి మైఖేల్ తో పెళ్లి కొరకే శ్రుతి ఈ నిర్ణయం తీసుకుందని అందరు భవించారు. ఐతే సడన్ గా వీరిద్దరూ విడిపోయి మళ్ళీ ట్విస్ట్ ఇచ్చారు. ఈ మధ్య లండన్లో కొన్ని లైవ్ మ్యూజిక్ షో లో నిర్వహించిన శృతి మళ్లీ సినిమాలలో నటించేందుకు సిద్ధమయ్యారు.

ఐతే శృతికి హాలీవుడ్ నుండి ఓ పెద్ద ఆఫర్ వచ్చిందని సమాచారం. యు ఎస్ ఏ నెట్వర్క్స్ నిర్మించనున్న ‘ట్రెండ్ స్టోన్’ సిరీస్ లో ఓ కీలక పాత్రకోసం నిర్మాతలు శృతి హాసన్ ను సంప్రదించారట. దీనికి ఆమె సానుకూలంగా స్పందించడంతో ప్రాజెక్ట్ ఓకే చేశారట. జేసన్ బౌర్న్ సిరీస్ ఆధారంగా తెరకెక్కనున్న ఈ యాక్షన్ ఎపిసోడ్స్ లో శృతి హాసన్ వెయిట్రెస్ ముసుగులో హత్యలు చేసే కిల్లర్ పాత్రలో కనిపించానుందని సమాచారం. ఇప్పటికే ప్రియాంకా చోప్రా ఇలాంటి సిరీస్లలో నటించి హాలీవుడ్ లో మంచి పొజిషన్ లో ఉంది. ఈ సిరీస్ కనుక సక్సెస్ ఐతే శృతి రేంజ్ కూడా పెరిగిపోవడం ఖాయం.

సంబంధిత సమాచారం :

X
More