బాలయ్య సరసన శృతి హాసన్ ?

Published on May 16, 2021 10:40 pm IST

‘డాన్ శీను, బలుపు, పండగ చేస్కో’ లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని ‘క్రాక్’ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ కొట్టి ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో స్టార్ హీరోయినే ఉండాలని ప్లాన్ చేసిన గోపీచంద్, శృతి హాసన్ ను బాలకృష్ణ సరసన నటించడానికి ఒప్పించాడని తెలుస్తోంది. గోపీచంద్ ‘క్రాక్’ సినిమాతో శృతి హాసన్ కి మంచి హిట్ ఇచ్చాడు.

దాంతో, శృతి హాసన్ గోపీచంద్ మలినేని కోసం బాలయ్య సినిమా ఒప్పుకుందట. ఇక బాలయ్య బాబుకు సరిపోయే కథ గోపీచంద్ చెప్పినట్లు తెలుస్తోంది. పల్నాటి ప్రాంతానికి చెందిన ఓ చరిత్రకారుడి కథ ఆధారంగా గోపీచంద్ బాలయ్యకు కథ చెప్పాడట. జులై నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలయ్య జులై కల్లా అఖండను పూర్తి చేయనున్నాడు.

సంబంధిత సమాచారం :