తన రిలేషన్ షిప్ స్టేటస్ పై క్లారిటీ ఇచ్చిన శృతి హాసన్

తన రిలేషన్ షిప్ స్టేటస్ పై క్లారిటీ ఇచ్చిన శృతి హాసన్

Published on May 23, 2024 10:00 PM IST

ప్రస్తుతం మన సౌత్ ఇండియా సినిమా దగ్గర మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది శృతి హాసన్ అని చెప్పాలి. దాదాపు మన స్టార్ హీరోస్ సాలిడ్ కం బ్యాక్ చిత్రాల్లో శృతి హాసన్ నే ఉండడం గమనార్హం. ఇక రీసెంట్ గానే ప్రభాస్ సరసన “సలార్” కనిపించిన ఈమె మరిన్ని చిత్రాలతో ముందు రోజుల్లో రాబోతుంది. అయితే గత కొన్నాళ్ల కితమే శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ చెప్పినట్టుగా పలు వార్తలు వినిపించాయి.

మరి లేటెస్ట్ గా తన రిలేషన్ షిప్ స్టేటస్ పై అయితే ఆమె ఓపెన్ అయ్యింది. తాజాగా ఇన్స్టాగ్రామ్ ఇచ్చిన ఇంట్రాక్షన్ లో వచ్చిన ప్రశ్నకి సమాధానం ఇస్తూ తనకి ఇలాంటి వాటికి సమాధానం చెప్పడం ఇష్టం ఉండదు కానీ ఇప్పుడు చెప్తానని తెలిపింది. ఆమె ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నాను అని అలాగే కేవలం నా వర్క్, లైఫ్ ని ఎంజాయ్ చెయ్యడంలో మాత్రమే మింగిల్ అవ్వడానికే ఇష్టపడతాను అని ఆమె క్లారిటీ ఇచ్చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు