సూర్య క్రేజీ ప్రాజెక్ట్ లో శృతి హాసన్

సూర్య క్రేజీ ప్రాజెక్ట్ లో శృతి హాసన్

Published on May 15, 2015 3:38 PM IST

suriya-shruthi-hasaan

తమిళ స్టార్ హీరోకి తెలుగులో స్టార్డం తెచ్చి పెట్టిన సినిమా సినిమా ‘సింగం’. తెలుగులో యముడు గా వచ్చిన ఈ సినిమాలో సూర్య పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించి మెప్పించాడు. గత ఏడాది ఈ సినిమాకి సీక్వెల్ సింగం వచ్చి బాక్స్ ఆఫీసు వద్ద పెద్ద హిట్ అయ్యింది. తెలుగు మరియు తమిళ్ లో సూర్య మార్కెట్ ని పెంచిన సినిమాలు ఇవి. ఈ సక్సెస్ఫుల్ ప్రాంచైజీలకు సీక్వెల్ గా మూడవ పార్ట్ రానుందని ఇది వరకే తెలియజేశాం. ఇప్పటికే ఈ చిత్రాల డైరెక్టర్ హరి 3వ పార్ట్ కి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసాడు.

కోలీవుడ్ వర్గాల తాజా సమాచారం ప్రకారం సౌత్ ఇండియన్ హాట్ బ్యూటీ శృతి హసన్ సింగం 3వ పార్ట్ లో హీరోయిన్ గా సైన్ చేసింది. మొదటి రెండు పార్ట్స్ లో కంటిన్యూ అయిన అనుష్క హీరోయిన్ గా అలానే ఉంటుంది, అనుశ్క్ కాకుండా శృతి హాసన్ కూడా ఈ సినిమాలో సూర్యతో కలిసి స్క్రీన్ పంచుకోనుంది. శృతి హరి చెప్పిన లైన్ నచ్చడంతో ఈ సినిమాకి సిం చేసిందట. ప్రస్తుతం సూర్య విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో 24 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తవ్వగానే సింగం 3 ని మొదలు పెట్టి 2016 సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

శృతి హాసన్ ప్రస్తుతం తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఓ సినిమా చేస్తుంటే, తమిళంలో విజయ్, అజిత్ ల సరసన చెరొక సినిమా చేస్తోంది. ఇప్పుడు తమిళంలో మరో స్టార్ అయిన సూర్య సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు