శృతి హాసన్ మళ్ళీ సినిమాలపై మనసు పెట్టినట్లుందిగా…!

Published on Jun 3, 2019 12:00 am IST

టాప్ హీరోయిన్ గా సౌత్ లో మంచి అవకాశాలు వస్తున్న తరుణంలో సడన్ గా నటనకు ఫుల్ స్టాప్ పెట్టేసింది శృతిహాసన్.ఆమె తన బాయ్ ప్రెండ్ మైఖేల్ తో లండన్ వెళ్లిపోయారు. ప్రియుడు మైఖేల్ ను కుటుంబ సభ్యుల కు కూడా పరిచయం చేయడం తో మైకేల్ తో పెళ్లి కోసమే తాను సినిమాలను దూరం పెట్టారు అనుకున్నారంత. ఐతే సడన్ గా మేము విడిపోయాం అని చెప్పి ఇండస్ట్రీ జనాలను షాక్ గురిచేసింది ఈ జంట.

మొన్నటి వరకు లండన్ లో తనకు ఇష్టమైన లైవ్ మ్యూజిక్ షోస్ చేసిన శృతి, మళ్ళీ నటనపై ఫోకస్ పెట్టారని వినికిడి. త్వరలో ప్రారంభం కానున్న కొరటాల,చిరంజీవి మూవీలో హీరోయిన్ గా శృతి పేరు పరిశీలనలో ఉంది. అలాగే గోపిచంద్ మలినేని,రవి తేజ కాంబినేషన్ లో రానున్న ఓ మూవీ లో కూడా శృతి నటించే అవకాశాలున్నాయి అంటున్నారు. కారణాలేమైనా శృతి మళ్ళీ తెలుగు తెరపై మెరిసి తన అభిమానులను అలరించనున్నారు.

సంబంధిత సమాచారం :

More