షూటింగ్ మధ్యలోనే వెళ్ళిపోయిన శృతి హాసన్

Published on Nov 23, 2020 11:09 pm IST

ఈమధ్య సినిమాలు కౌంట్ కొద్దిగా తగ్గించిన స్టార్ నటి శృతి హాసన్ ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు, మధ్యలో పాప్ సంగీతంలో కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకున్న ఆమె సినిమాలకు కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు తెలుగు, తమిళ పరిశ్రమల్లో సినిమాలు స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె తెలుగులో పవన్ సరసన ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్నారు. తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా చేస్తున్న ‘లాభం’ సినిమాలో కూడ కథానాయకిగా నటిస్తోంది.

ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ క్రిష్ణగిరి పరిసర ప్రాంతాల్లో జరుగుతోందట. ఈ సంగతి తెలుసుకున్న ఆ ప్రాంత వాసులు హీరో హీరోయిన్లను చూడటం కోసం భారీ సంఖ్యలో లోకేష్ వద్దకు చేరుకున్నారు. అసలే కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో షూటింగ్స్ చాలా జాగ్రత్తగా జరుపుతున్నారు. వీలైనంత తక్కువ బృందంతో సినిమా చిత్రీకరణ చేస్తున్నారు. అలా ఒక్కసారి జనం సెట్ వద్దకు వచ్చేయడంతో శృతి హాసన్ కంగారును గురయ్యారు. ప్రజెంట్ పరిస్థితుల్లో జనాన్ని కలవడం మంచిది కాదని వెంటనే లొకేషన్ నుండి వెళ్లిపోయారట.

సంబంధిత సమాచారం :

More