‘జెర్సీ’ లో నటించనున్న శ్రుతీ హాసన్ ?

‘జెర్సీ’ లో నటించనున్న శ్రుతీ హాసన్ ?

Published on Jun 20, 2018 12:09 AM IST

హీరో నాని నటించనున్న ‘జెర్సీ’ చిత్ర షూటింగ్ ఈ సెప్టెంబర్ నుండి ప్రారభం కానుంది క్రికెట్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘మళ్ళీ రావా’ చిత్ర డైరెక్టర్ గౌతమ్ దర్శకత్వం వహించనున్నాడు ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రం పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనుంది .

నాని ఈ సినిమాలో అర్జున్ అనే పాత్రలో నటించనున్నాడు . ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది . ఇక ఈ చిత్రంలో నానికి జోడిగా శ్రుతీ హాసన్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట దర్శక నిర్మాతలు . 1986 నుండి 1996 మధ్య లో నడిచే కథ నేపథ్యంలో సాగనుంది ఈ చిత్రం . మరి శ్రుతీ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు