శర్వా కొత్త చిత్రం నుండి అప్డేట్ రానుంది !

Published on Mar 5, 2019 11:17 am IST

యంగ్ హీరో శర్వానంద్, ‘స్వామి రారా’ పేమ్ సుధీర్ వర్మ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక ఈ చిత్రం నుండి ఈనెల 6న శర్వా బర్త్ డే సందర్భంగా ఒక అప్డేట్ వెలుబడనుందని సమాచారం. బహుశా ఈసినిమా టైటిల్ ను రివీల్ చేసే అవకాశం వుంది.

గ్యాంగ్ స్టర్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ , ‘హలో’ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్లు గా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో శర్వా ద్వి పాత్రాభినయం చేస్తున్నాడు. సమ్మర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More