యువ హీరో శర్వానంద్ ‘స్వామి రారా’ పేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాలోనటిస్తున్నాడని తెలిసిందే. ఈసినిమా తదుపరి షెడ్యూల్ కోసం కొరియా వెళ్లనుంది చిత్రం యూనిట్. దాదాపు గా అక్కడ 25వ రోజుల పాటు షూటింగ్ జరుపుకోనుంది ఈ చిత్రం. దాంతో ఈ సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కాజల్ , కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్లుగా నటిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తుంది. ఇంకా ఈచిత్రానికి టైటిల్ ఖరారు కాలేదు.
ఇక శర్వా ఈ చిత్రంతో పాటు ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ పేమ్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘పడి పడి లేచె’ మనసు చిత్రంలో సాయి పల్లవి తో కలిసి నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ నేపాల్ లో జరుగుతుంది. డిసెంబర్ 21న ఈచిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.
