నాని సినిమా సాంగ్స్ కూడా కలకత్తా సెట్ లోనే !

నాని సినిమా సాంగ్స్ కూడా కలకత్తా సెట్ లోనే !

Published on Nov 8, 2020 2:35 AM IST

నేచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘శ్యామ్ సింఘ రాయ్’ సినిమా పాతతరం కలకత్తా నేపథ్యంలో సాగుతుంది. హైదరాబాద్ లోని ఖాళీగా ఉంటున్న అల్యుమినియమ్ ఫ్యాక్టరీలో కలకత్తా సెట్ కూడా వేశారు. కాగా ప్రస్తుతం ఈ సెట్ లోనే షూట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇక్కడ మరో వారం రోజుల్లో పూర్తి అవుతుందని.. షూట్ పూర్తయ్యాక ఈ సినిమా సాంగ్స్ షూట్ కూడా ఇక్కడే మొదలు అవుతుందని తెలుస్తోంది.

కాగా ఈ సినిమా కథ కాస్త ఫాంటసీ మిక్స్ అయి, ఎమోషనల్ గా సాగే పక్కా ఫిక్షనల్ డ్రామాగా సినిమా వుంటుందట. ఈ సినిమా పై సినిమా జనాల్లో కూడా బాగా ఆసక్తి ఉంది. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం క్రేజీ బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది. సాయి పల్లవి క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో వినూత్నంగా ఉండబోతుందట. నాని మొదటి నుండి ప్రేక్షకులకు కాస్త వైవిధ్యమైన కథలు చెప్పడానికి.. మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు