మెగాస్టార్ చిరంజీవి దంపతులను కలిసిన శ్యామ్ సింగరాయ్

Published on Jan 21, 2022 11:32 am IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రం పై ప్రేక్షకులు, అభిమానులు, ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విడుదల అయిన రోజు నుండి సినిమా పై ప్రతి ఒక్కరూ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి శ్యామ్ సింగరాయ్ చూసి, నాని ను అభినందించడం జరిగింది. అందుకు సంబంధించిన ఒక ఫోటో ను నాని సోషల్ మీడియా లో షేర్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

తాజాగా హీరో నాని మెగాస్టార్ చిరంజీవి దంపతులను కలిశారు. అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది. మెగాస్టార్ చిరంజీవి మరియు సురేఖ ల ను కలవడం పట్ల నాని సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రం లో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటించగా నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం :