మార్వలెస్ & థ్రిల్లింగ్ గా సిబి సత్యరాజ్ ‘మాయోన్’ ట్రైలర్

మార్వలెస్ & థ్రిల్లింగ్ గా సిబి సత్యరాజ్ ‘మాయోన్’ ట్రైలర్

Published on Jul 1, 2022 9:36 PM IST

కోలీవుడ్ నటుడు సత్యరాజ్ తనయుడు సిబి సత్యరాజ్ తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితం. తండ్రితో కలిసి ఇటీవల ఆయన నటించిన దొర మూవీ తెలుగులో కూడా మంచి పేరు అందుకుంది. ఇక ప్రస్తుతం సిబి నటిస్తున్న తాజా సినిమా మాయోన్. తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి ఇళయరాజా సంగీతం అందిస్తుండగా రామ్ ప్రసాద్ కెమేరామ్యాన్ గా వ్యవహరించారు. ఎన్ కిశోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని డబుల్ మీనింగ్ ప్రొడక్షన్స్ సంస్థపై అరుణ్ మోజి మాణిక్యం ఎంతో భారీ వ్యయంతో నిర్మించారు.

పురాతన దేవాలయాల్లో జరిగే రహస్య పరిశోధన నేపథ్యంలో సైన్స్ కి దేవుడికి మధ్య సాగె థీమ్ తో ఈ మూవీ తెరకెక్కింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్, సాంగ్స్ ఆకట్టుకోగా నేడు రిలీజ్ అయిన ట్రైలర్ మరింతగా అందరిలో మూవీ పై అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా ట్రైలర్ లో గ్రాండియర్, మార్వలెస్ గా ఉన్న విజువల్స్, ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్, ఫైట్ సీన్స్ వంటివి ట్రైలర్ చూసిన వారికి సినిమాపై ఎంతో ఆసక్తిని తప్పకుండా రేకెత్తిస్తాయి. ఈ మూవీ తెలుగు హక్కులు మూవీ మాక్స్ అధినేత మామిడాల శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. దర్శకుడు కిషోర్ మూవీ ని ఎంతో అద్భుతంగా తీసారని, తప్పకుండా మాయోన్ మూవీ మంచి సక్సెస్ అందుకుంటుందని శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేసారు. కాగా జులై 7న తెలుగు, తమిళ భాషల్లో మాయోన్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు