ఆఫీషియల్ : సిద్ధార్థ్ “చిన్నా” ఓటీటీ డేట్ ఖరారు.!

Published on Nov 21, 2023 7:02 am IST

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రమే “చిన్నా”. మరి ఒక ఎమోషనల్ అండ్ థ్రిల్లర్ సబ్జెక్ట్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు ఎస్ యూ అరుణ్ కుమార్ తెరకెక్కించాడు. తమిళ్ లో “చిత్తా” గా తెరకెక్కించిన ఈ. చిత్రంతో సిద్ధార్థ్ నిర్మాతగా కూడా మారాడు. అయితే ఈ చిత్రం తెలుగులో కూడా మంచి సక్సెస్ ని అయితే అందుకుంది.

ఇక ఫైనల్ గా ఈ చిత్రం ఓటీటీ లో రిలీజ్ కి అఫీషియల్ డేట్ ని లాక్ చేసుకుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు కొనుగోలు చేయగా అందులో ఈ సినిమా ఈ నవంబర్ 28 నుంచి పాన్ ఇండియా భాషల్లో అందుబాటులో ఉండనున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. మరి అప్పుడు మిస్ అయ్యినవారుఈ సారి డెఫినెట్ గా ఈ చిత్రాన్ని చూడొచ్చు.

సంబంధిత సమాచారం :