
సిద్దార్థ్, హన్సిక హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా ‘సంథింగ్.. సంథింగ్’. ఈ సినిమాలోని పాటల చిత్రీకరణ కోసం ఈ టీంవారు జపాన్ వెళ్లారు. సుందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఖుష్బూ నిర్మిస్తోంది. ఈ సినిమాని తెలుగులో లక్ష్మీ గణపతి ఫిలింస్ వారు ఆంద్ర ప్రదేశ్ అంతట విడుదల చేస్తున్నారు. ‘ఈ రాత్రికి నేను జపాన్ వెళ్తున్నాను. ఆదివారం ఉదయానికి అక్కడ వుంటాను. నేను ఈ సినిమా గురించి చాలా నమ్మకంగా వున్నాను’ అని సిద్దార్థ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ సినిమాలోని పాటలని జపాన్ లోని తోయమలో షూట్ చేసే అవకాశం వుంది. ఈ సినిమా తెలుగు వర్షన్ లో బ్రహ్మానందం, తమిళ వర్షన్ లో సంతానంలు నటిస్తున్నారు. ఈ సినిమా తమిళంలో ‘తీయ వేల సైయ్యనుమ్ కుమారు’ పేరుతో నిర్మించబడుతోంది. సత్య సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా మే లో విడుదలయ్యే అవకాశం వుంది.
జపాన్ వెళ్ళీన సిద్దార్థ్, హన్సిక
జపాన్ వెళ్ళీన సిద్దార్థ్, హన్సిక
Published on Apr 9, 2013 2:13 AM IST
సంబంధిత సమాచారం
- ‘జెంజ్ బ్యాచ్’కి బాలయ్య వాయిస్ ఓవర్ ?
- ఓటీటీ/థియేటర్ : ఈ వీక్ అలరించనున్న సిరీస్ లు, చిత్రాలివే !
- నైజాంలో రవితేజ జోరు.. 3 రోజుల్లోనే భారీ వసూళ్లు !
- ఎన్టీఆర్ లుక్ పై త్రివిక్రమ్ ప్రత్యేక దృష్టి !
- పోల్: ‘మహాకాళి’ గ్లింప్స్ ఎలా అనిపించింది?
- డిసెంబర్ 24న బాలయ్య సినిమా.. నిజమేనా ?
- రవితేజ సినీ కెరీర్ లోనే మరో మైలురాయి !
- ఇరుముడి: మూడవ రోజు కూడా భారీ కలెక్షన్స్ !
- బన్నీ ‘రాకా’ పై మరో క్రేజీ రూమర్ ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బన్నీ ‘రాకా’ పై మరో క్రేజీ రూమర్ ?
- రవితేజ సినీ కెరీర్ లోనే అద్భుతమైన ఘనత !
- “విశ్వనాథ్ అండ్ సన్స్” మరో భారీ మైల్ స్టోన్.. 500 కోట్లతో సూర్య కెరీర్లో అరుదైన ఫీట్
- ‘ఆదర్శ కుటుంబం’లో హైడ్ అండ్ సిక్ ట్రాక్ ?
- తెలుగు స్టేట్స్ లో ‘టాక్సిక్’ బుకింగ్స్ ఎప్పటి నుంచి అంటే.. ఇక్కడా ఇంపాక్ట్ చూపిస్తుందా?
- తెలుగులో స్పీచ్ అదరగొట్టిన యష్.. తెలుగు ప్రేక్షకులకు మొదటిసారి స్పెషల్ థాంక్స్ ఎందుకంటే!
- డే 3 మరింత భారీగా “ఇరుముడి”.. అసలు టెస్ట్ ఇప్పుడు నుంచే!
- ‘యశ్’తో పనిచేయడం గొప్ప అనుభూతి – రుక్మిణి వసంత్

