సిద్దార్థ్ నెంబర్ లీక్ చేసి 500కు పైగా పొలిటికల్ బెదిరింపు కాల్స్.!

Published on Apr 29, 2021 2:00 pm IST

ప్రముఖ నటుడు సిద్ధార్థ్ మన తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా సుపరిచితం. అలాగే ఇప్పుడు మళ్ళీ చాలా కాలం విరామం అనంతరం తెలుగులో రీఎంట్రీ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాడు. అయితే తాజాగా సిద్ధార్థ్ తనకి ఎదురైన చేదు ఘటన సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు. అయితే దీనికి ముందు ఇంకో విషయం ఉంది..

ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల మూలాన సిద్ధార్థ్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న బీజేపీను పలు మార్లు ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. మరి వాటిపైనే ఏమో తన నెంబర్ తమిళనాడు బీజేపీ మరియు అక్కడి బీజేపీ ఐటీ విభాగం వారు బయట పెట్టారని అక్కడ నుంచి తనకి 500 కు పైగా హత్యా చేస్తామని..

బెదిరింపులు అలాగే తన కుటుంబ సభ్యులుపై కూడా దారుణంగా తిడుతూ 24 గంటలు అలా కాల్ చేస్తూనే ఉన్నారని అలా చేసిన ప్రతి ఒక్కరి నంబర్స్ కాల్ రికార్డ్ మరియు బీజేపీ లింక్స్ సహా ఫోటోలు పోలీసులకు ఇస్తానని తాను వెనక్కి తగ్గేది లేదు అని సిద్ధార్థ్ ఖరాఖండిగా చెప్పేసాడు. మరి ఈ వివాదం ఎంత వరకు వెళ్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :