నాకు అంద‌రితోనూ గౌర‌వ‌ప్ర‌ద‌మైన కెమిస్ట్రీ కుదిరిందంటున్న హీరోయిన్ !

నాకు అంద‌రితోనూ గౌర‌వ‌ప్ర‌ద‌మైన కెమిస్ట్రీ కుదిరిందంటున్న హీరోయిన్ !

Published on Jun 19, 2018 4:29 PM IST

Siddhi Idnani1
కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన తాజా చిత్రం ‘జంబలకిడి పంబ’. జూన్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో శ్రీనివాసరెడ్డి సరసన హీరోయిన్ గా సిద్ధి ఇద్నానీ నటించింది. విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్రబృందం చిత్ర ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ప్రమోషన్ లో పాల్గొన్న హీరోయిన్ సిద్ధి ఇద్నానీ మాట్లాడుతూ ఈ చిత్రంలోని తన పాత్ర గురించి, తనతో పాటు నటించిన మిగిలిన నటీనటుల గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో నేను, పోసాని కృష్ణమురళి, శ్రీనివాస‌రెడ్డిగార్ల కాంబినేషన్ లో ఫస్ట్ షాట్ చేశాను.

నాకు మొదటిరోజు మొదటి షాట్ అయినా, ఫస్ట్ టేక్ లోనే షాట్‌ ఓకే ఆయిపోయింది. ఇక అప్పటి నుంచి లాస్ట్ షాట్ వరకు ఎక్కడ ఇబ్బంది పడలేదు, ఏ సన్నివేశంలోనూ ఎక్కువ టేక్ లు తీసుకోలేదు. ఈ చిత్రంలో నాకు అంద‌రితోనూ గౌర‌వ‌ప్ర‌ద‌మైన కెమిస్ట్రీ కుదిరింది అని సిద్ధి ఇద్నానీ చెప్పుకొచ్చింది.

తాజా వార్తలు