సైమా 2019 అవార్డులలో రంగస్థలం ప్రభంజనం.

సైమా 2019 అవార్డులలో రంగస్థలం ప్రభంజనం.

Published on Aug 16, 2019 1:11 PM IST

ఖతార్ లోని దోహా వేదికగా జరుగుతున్న సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ లో రామ్ చరణ్ నటించిన రంగస్థలం కి అవార్డుల పంట పండింది. ఉత్తమ నటుడు(రామ్ చరణ్), ఉత్తమ దర్శకుడు(సుకుమార్),ఉత్తమ సహాయనటి(అనసూయ),ఉత్తమ గేయరచయిత(చంద్రబోస్) ఇలా మొత్తం 9విభాగాలలో అవార్డులు అందుకొని రికార్డు నెలకొల్పింది. ఆతరువాత అందరూ ఊహించినట్లే మహానటి చిత్రం ఉత్తమ చిత్రం(మహానటి), ఉత్తమ నటి(కీర్తి సురేష్), ఉత్తమ సహాయ నటుడు( రాజేంద్ర ప్రసాద్) వంటి మూడు విభాగాలలో అవార్డులు గెలుచుకుంది.

ఇక సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు( గీత గోవిందం) మరియు సామాజిక మాధ్యమాల్లో పాపులర్‌ స్టార్ కేటగిరీలకు గాను రెండు అవార్డులు సొంతం చేసుకున్నారు. అలాగే మరో సంచలన చిత్రం ఆర్ ఎక్స్ 100 కూడా ఉత్తమ తొలిచిత్ర నటి, తొలిచిత్ర దర్శకుడు, గాయకుడు వంటి మూడు విభాగాలలో అవార్డులు పొందడం జరిగింది.

తెలుగు విభాగంలో అవార్డులు పొందిన చిత్రాల వివరాలు ఇలా ఉన్నాయి…
ఉత్తమ చిత్రం : మహానటి
ఉత్తమ దర్శకుడు : సుకుమార్‌ (రంగస్థలం)
ఉత్తమ నటుడు : రామ్‌చరణ్‌ (రంగస్థలం)
ఉత్తమ నటి : కీర్తి సురేష్‌ (మహానటి)
విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు : విజయ్‌ దేవరకొండ( గీత గోవిందం)
విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటి : సమంత (రంగస్థలం)
ఉత్తమ సహాయ నటుడు : రాజేంద్ర ప్రసాద్‌ ( మహానటి)
ఉత్తమ సహాయ నటి : అనసూయ (రంగస్థలం)
ఉత్తమ హాస్య నటుడు : సత్య (ఛలో)
ఉత్తమ విలన్‌ : శరత్‌ కుమార్‌ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా)
ఉత్తమ సంగీత దర్శకుడు : దేవీ శ్రీ ప్రసాద్‌ (రంగస్థలం)
ఉత్తమ గేయ రచయిత : చంద్రబోస్‌ (ఎంత సక్కగున్నవవే – రంగస్థలం)
ఉత్తమ గాయకుడు : అనురాగ్ కులకర్ణి( పిల్ల రా – ఆర్‌ఎక్స్‌ 100)
ఉత్తమ గాయని : ఎంఎం మానసీ (రంగమ్మా మంగమ్మ – రంగస్థలం)
ఉత్తమ తొలిచిత్ర నటుడు : కల్యాణ్ దేవ్‌ (విజేత)
ఉత్తమ తొలిచిత్ర నటి : పాయల్‌ రాజ్‌పుత్‌ (ఆర్‌ఎక్స్‌ 100)
ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు : అజయ్‌ భూపతి (ఆర్‌ఎక్స్‌ 100)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ : రత్నవేలు (రంగస్థలం)
ఉత్తమ కళా దర్శకడు : రామకృష్ణ (రం‍గస్థలం)
సామాజిక మాధ్యమాల్లో పాపులర్‌ స్టార్ : విజయ్‌ దేవరకొండ

సంబంధిత సమాచారం

తాజా వార్తలు