సైమా కోసం చలో దుబాయ్ అంటున్న తారలు

సైమా కోసం చలో దుబాయ్ అంటున్న తారలు

Published on Aug 5, 2015 7:47 PM IST

siima-awards1
ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే సౌత్ ఇండియన్ సైమా అవార్డ్స్ వేడుక ఈ ఏడాది కూడా సిద్దమైంది. ఈ ఏడాది సైమా అవార్డ్స్ 6,7 తేదీలలో దుబాయ్ లో జరగనుంది. రెండు రోజుల పాటు ఘనంగా జరిగే ఈ వేడుక రేపటి నుంచే మొదలు కానుంది. దీంతో సినీ ఇండస్ట్రీలలో అప్పుడే సైమా అవార్డ్స్ హడావిడి మొదలైంది. ఇప్పటికే పలు ఇండస్ట్రీలలో నుంచి పలువురు హీరోస్, హీరోయిన్స్ దుబాయ్ లో ల్యాండ్ అయిపోయారు. మరి కొంతమంది ఇప్పుడు బయలు దేరి వెళ్తున్నారు.

భారీ ఎత్తున చాలా గ్రాండ్ గా జరిగే ఈ వేడుకకి సౌత్ ఇండియాలోని నలుగు ఫిల్మ్ ఇండస్ట్రీల నుంచి టాప్ స్టార్స్ అందరూ హాజరవ్వడమే కాకుండా ఆన్ స్టేజ్ పెర్ఫార్మన్స్ లతో కూడా ఆకట్టుకోనున్నారు. సైమా అవార్డ్స్ లో డాన్సులు వేసే పలువురు తారలు ఇప్పటికే చేరుకొని ప్రాక్టీస్ లు చేస్తుంటే మరికొంత మంది ఇప్పుడు దుబాయ్ చేరుకుంటున్నారు. గత ఏడాది తెలుగులో చాలా హిట్ సినిమాలు వచ్చాయి. ప్రతి అవార్డు విషయంలో చాలా ఆసక్తి నెలకొంది. అభిమానులు కోడా ఏ హీరోకి బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా అవార్డ్స్ డీటైల్స్ కోసం 123తెలుగు.కామ్ విజిట్ చేస్తూ ఉండండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు