సూర్య ‘సికందర్’లో 20 నిమిషాలు కట్ చేసిన టీం.!

సూర్య ‘సికందర్’లో 20 నిమిషాలు కట్ చేసిన టీం.!

Published on Aug 18, 2014 5:26 PM IST

Sikandar
తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘సికందర్’ సినిమా గత శుక్రవారం విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అందుకోలేకపోయింది. ట్రైలర్ చూసి చాలా ఊహించి వచ్చిన ఆడియన్స్ కి సినిమా చూసాక నిరాశే ఎదురైంది. అలాగే ఇటు విమర్శకులు, అటు ఆడియన్స్ చెప్పిన మేజర్ మైనస్ సినిమా నిడివి ఎక్కువ కావటం. ఈ విషయాన్ని గమనించిన ఈ చిత్ర టీం సినిమా నిడివిని తగ్గించడానికి నిర్ణయించుకుంది.

ఈ చిత్ర టీం తెలుగు మరియు తమిళంలో దాదాపు 20 నిమిషాలను కట్ చేసి రీ ఎడిట్ చేసారు. ఫస్ట్ హాఫ్ లో 9 నిమిషాలు కట్ చేయగా, సెకండాఫ్ లో 11 నిమిషాలు కట్ చేసారు. ఈ రోజు మధ్యాహ్నం మ్యాట్నీ నుంచి కొన్ని చోట్ల ట్రిమ్ వెర్షన్ ని ప్రదర్శిస్తున్నారు. మరి కొన్ని ఏరియాల్లో ఫస్ట్ షో నుంచి ట్రిమ్ చేసిన సినిమాని ప్రదర్శించనున్నారు. ఈ ట్రిమ్ వెర్షన్ కి కాస్త బెటర్ రెస్పాన్స్ వస్తుందని ఈ చిత్ర టీం ఆశిస్తోంది.

సూర్య సరసన సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి లింగుసామి డైరెక్టర్. యువన్ శంకర్ రాజ సంగీతం అందించిన ఈ సినిమాని తెలుగు లగడపాటి శ్రీధర్ రిలీజ్ చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు