ఇంటర్వ్యూ : భరత్ చౌధరి, కిరణ్ రెడ్డి – సిల్లీ ఫెలోస్’తో హ్యాట్రిక్ గ్యారెంటీ !
Published on Sep 4, 2018 5:08 pm IST

అల్లరి నరేష్, సునీల్ హీరోలుగా భీమినేని శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం సిల్లీ ఫెలోస్ . కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈచిత్రం ఈనెల 7న ప్రేక్షకులముందుకు రానుంది. ఈసందర్భంగా చిత్ర నిర్మాతలు మీడియా తో మాట్లాడారు ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం ..

ఈచిత్రం ఎలా పట్టాలెక్కింది ?

భీమినేని శ్రీనివాస్ గారు ఫస్ట్ ఈ కథను మాకు వినిపించారు. చాలా బాగా నచ్చింది. హీరోలుగా అల్లరి నరేష్, సునీల్ ఈ చిత్రానికి కరెక్ట్ గా సరిపోతారని అనుకున్నాం. వాళ్ళు కూడా వెంటనే ఈసినిమాను ఒప్పుకోవడంతో ఈ సినిమాను నిర్మించాం. ముఖ్యం గా వాళ్ళ సహకారం లేకపోతే ఈ చిత్రం ఇంత బాగా వచ్చేది కాదు వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు.

మీ బ్యానేర్ లో ఇది ఎన్నో సినిమా ?
మా బ్యానేర్లో ఇది 3వ సినిమా ఇంతకుముందు ‘నేనే రాజు నేనే మంత్రి’, ఎమ్ఎల్ఎ’ చిత్రాలను నిర్మించాం. రెండుకూడా సూపర్ హిట్ ఆయాయ్యి. ఈ సిల్లీ ఫెలోస్ తో హ్యాట్రిక్ కొట్టబోతున్నాం.

నేనే రాజు నేనే మంత్రి సినిమాకు సీక్వెల్ ఉంటుందా ?
ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదు. ఒకవేళ మంచి కథ దొరికి సురేష్ బాబు గారు , తేజ అందరం కథను ఒకే అనుకుంటే తప్పకుండా సీక్వెల్ నిర్మిస్తాం. ప్రస్తుతం అయితే ఈ సినిమా మీదనే ఫుల్ కాన్సంట్రేషన్ పెట్టాం.

సిల్లీ ఫెలోస్ బిజినెస్ గురించి ?
ఈసినిమా మొదట ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఆంధ్రలోని మూడు జిల్లాలకు కొన్నారు. ఆతరువాత సినిమా అయనకు బాగా నచ్చడంతో నైజాం హక్కులను కూడా ఆయన దక్కించుకున్నారు. బెంగుళూరు,ఓవర్శిస్ తో అన్ని చోట్ల సినిమా అమ్మేశాం. చాలా మంచి బిజినెస్ జరిగింది .

ఈచిత్రం గురించి ?
సినిమా ఫుల్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండనుంది అన్ని సెంటర్ల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది . భీమినేని గారి భలం కామెడీ ఈచిత్రంలో దాన్ని బాగా డీల్ చేశాడు.

సినిమాలో పాటల గురించి ?

ఈచిత్రంలో రెండు పాటలు వున్నాయి . ఒకటి హీరో, హీరోయిన్ మధ్యన వచ్చేది కాగా మరొకటి ఇద్దరు హీరోల మధ్య వస్తుంది. దాంతో పటు ఒక ప్రమోషనల్ సాంగ్ కూడా ఉంటుంది. ఇటీవల విడుదల చేసిన ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈసినిమా హీరోయిన్స్ గురించి ?

ఈసినిమాలో చిత్ర శుక్ల, షమ్నా కాసిం హీరోయిన్లుగా నటించారు. చాలా బాగా చేశారు. ఈసినిమాకు వాళ్ల పాత్రలు కూడా చాలా ముఖ్యమైనవి. నరేశ్ ,సునీల్, తో వీళ్లు చేసే కామెడీ బాగా నవ్విస్తుంది.

మీ తదుపరి చిత్రం ఎన్టీఆర్ తో అని విన్నాం నిజమేనా ?

లేదండి అబద్దం. అంత హై రేంజ్ చిత్రాలు ఇంకా ప్లాన్ చేయలేదు. ప్రస్తుతం మీడియం బడ్జెట్ చిత్రాలను మాత్రేమే ప్లాన్ చేస్తున్నాం. అయినా ఎన్టీఆర్ గారు మాకు డేట్స్ ఇస్తానంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది. ప్రస్తుతానికి ఇంకా ఏ సినిమాకు కమిట్ కాలేదు. ఈసినిమా విడుదల తరువాత కొత్త ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తాం.

  • 19
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook