పాత రోజుల్ని గుర్తు చేస్తానంటున్న అల్లరి నరేష్ !

పాత రోజుల్ని గుర్తు చేస్తానంటున్న అల్లరి నరేష్ !

Published on Jun 8, 2018 5:04 PM IST


ఒకప్పుడు కామెడీ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన హీరో అల్లరి నరేష్. ఆయన కెరీర్లో ‘కిత కితలు, సీమా శాస్త్రి, సుడిగాడు, బెండు అప్పారావ్, సీమ టపాకాయ్’ వంటి మంచి మంచి హిట్లున్నాయి. కానీ గత కొన్నేళ్లుగా ఆయన చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూనే ఉంది. తన పాత స్టైల్ ను వదిలేయడం వలనే నరేష్ సినిమాలు ఆడటం లేదనే కామెంట్స్ కూడ వినబడ్డాయి.

దీంతో నరేష్ భీమినేని శ్రీనివాసరావుతో కలిసి ఒక చిత్రం చేస్తున్నారు. అదే ‘సిల్లీ ఫెలోస్’. ఇది మంచి కామెడీ ఎంటర్టైనర్ గా, తన పాత స్టైల్లో ఉంటుందని నరేష్ అన్నారు. త్వరలో విడుదలకానున్న ఈ సినిమాలో చిత్ర శుక్ల కథానాయకిగా నటిస్తుండగా మరొక నటుడు సునీల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రేష్, భీమినేనిల ‘కలయికలో వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ ‘సుడిగాడు’ మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే

సంబంధిత సమాచారం

తాజా వార్తలు