13కిలోల బరువు తగ్గిన తమిళ హీరో !

Published on Apr 30, 2019 5:19 pm IST

కోలీవుడ్ యంగ్ హీరో శింబు ‘మానడు’ అనే చిత్రంలో నటించనున్నాడు. వెంకట్ ప్రభు తెరకెక్కించనున్న ఈ చిత్రం మే లో స్టార్ట్ కానుంది. ఇక ఈ చిత్రం కోసం శింబు బాగానే కష్టపడుతున్నాడు. కేవలం 37 రోజుల్లో 13 కేజీల బరువు తగ్గాడట శింబు.

ఈ చిత్రంలో శింబు కు జోడీగా మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ నటించనుంది. వి హౌస్ ప్రొడక్షన్ బ్యానేర్ ఫై సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఇక శింబు నటించిన చివరి రెండు చిత్రాలు చెక్క చివంత వనాం (నవాబ్) డీసెంట్ హిట్ అవ్వగా అత్తారింటికి దారేది రీమేక్ వంత రాజావత్తాన్ వారువేన్ యావరేజ్ అనిపించుకుంది.

సంబంధిత సమాచారం :