తనకు పేరు పెట్టమంటున్న స్టార్ హీరో

Published on Jan 18, 2020 1:30 am IST

తమిళ స్టార్ హీరో శింబు ‘మానాడు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో అనేక గొడవల కారణంగా ఈ ప్రాజెక్ట్ దాదాపు ఆగిపోయింది. కానీ తర్వాత అన్నీ సర్దుకుని ప్రాజెక్ట్ రీస్టార్ట్ అయింది. సినిమాలో శింబు ముస్లిం పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని, ఇదివరకు శింబు ఇలాంటి పాత్రను చేయలేదని, ఈ చిత్రం ఆయన అభిమానులను సప్రైజ్ చేస్తుందని దర్శకుడు వెంకట్ ప్రభు అంటున్నారు.

అంతేకాదు ఈ సినిమాలో హీరో పాత్రకు మంచి పేరును సజెస్ట్ చేయమని హీరో, డైరెక్టర్ అభిమానుల్ని కోరారు. దీంతో ఎస్టీఆర్ ఫ్యాన్స్ రకరకాల పేర్లను సూచిస్తూ సోషల్ మీడియాలో హీరో, దర్శకుడికి సందేశాలు పంపుతున్నారు. సురేష్ కామాట్చి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More