నెవర్ బిఫోర్ లుక్ లో శింబు…కొత్త చిత్రం టైటిల్ ఇదే!

Published on Aug 6, 2021 8:05 pm IST

గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం లో ప్రముఖ స్టార్ హీరో శింబు నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పై చిత్ర యూనిట్ నేడు అధికారిక ప్రకటన చేయడం జరిగింది. శింబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ ను వేందు తానింద కాదు గా ప్రకటించడం జరిగింది. అంతేకాక శింబు ఈ చిత్రం లో చాలా డిఫెరెంట్ గా కనిపిస్తున్నారు. అయితే ఫస్ట్ లుక్ విడుదల కావడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా శింబు కెరీర్ లో బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుంది అని చెప్పుకొస్తున్నారు. అయితే శింబు 47 వ చిత్రానికి సంగీతం ఏ ఆర్ రెహమాన్ అందిస్తున్నారు. అయితే ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :