నాగ్, ఎన్టీఆర్ నిర్మాత ఇక లేరు !

Published on Jan 18, 2021 10:00 am IST

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, పారిశ్రామికవేత్త వి దొరస్వామి రాజు సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. దొరస్వామి రాజు హైదరాబాద్ లోని కేర్ హాస్పిటల్లో చికత్స పొందుతూ మృతి చెందారు. ఆయన గత కొన్నినెలలుగా గుండెపోటుతో బాధపడుతున్నారు. నిర్మాతగా తన ప్రయాణంలో, వి.దొరస్వామి రాజు నాగార్జున కిరాయి దాదా, ఎఎన్ఆర్ యొక్క సీతారామయ్య గారి మనవరాలు, నాగ్ యొక్క అన్నమయ్య, ఎన్టిఆర్ యొక్క సింహాద్రి వంటి కొన్ని చిరస్మరణీయ చిత్రాలను నిర్మించారు.

పైగా ఆయన సీడెడ్ ప్రాంతంలో ప్రముఖ పంపిణీదారుడు. 750 కి పైగా చిత్రాలను పంపిణీ చేశాడు. సినీ ప్రముఖులు మరియు దోరస్వామి రాజు శ్రేయోభిలాషులు ఆయన మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 123తెలుగు.కామ్ తరఫున వి.దొరస్వామి రాజు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం :