200కోట్ల మార్క్ ను క్రాస్ చేసిన సింబా !

Published on Jan 9, 2019 6:00 pm IST

బాలీవుడ్ లో గత ఏడాది డిసెంబర్ 28న విడుదలై పాజిటివ్ టాక్ తో బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది ‘సింబా’ చిత్రం. రణ్వీర్ సింగ్ హీరోగా సూపర్ హిట్ తెలుగు మూవీ ‘టెంపర్’ కు రీమేక్ గా రోహిత్ శెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 202 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈచిత్రం రెండో వారంలోకి ప్రవేశించిన కూడా మంచి కలెక్షన్లను రాబడుతుంది. ముఖ్యంగా ఈ చిత్రానికి వేరే చిత్రాల నుండి పోటీ లేకపోవడం బాగా కలిసి వచ్చింది.

సారా అలీ ఖాన్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ ,రోహిత్ శెట్టి సంయుక్తంగా నిర్మించారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇక ఈచిత్రం రణ్వీర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కానుంది. ఇక ఒరిజినల్ వెర్షన్ లోనుండి సీన్ టు సీన్ కాపీ చేయకుండా స్క్రిప్ట్ విషయంలో చాలా మార్పులు చేశాడు రోహిత్ శెట్టి.

సంబంధిత సమాచారం :