‘ఛలో’ చిత్రంతో కెరీర్లోనే ఘనమైన కమర్షియల్ హిట్ అందుకున్న యంగ్ హీరో నాగ శౌర్య ప్రస్తుతం రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నారు. ఆయన తర్వాతి రెండు సినిమాల్ని కొత్త దర్శకులే డైరెక్ట్ చేయనుండటం విశేషం. వాటిలో ఒకటి ‘నర్తనశాల’. శ్రీనివాస్ చక్రవర్తి డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తిచేసుకుని మార్చి 3వ వారం నుండి మొదలుకానుంది.
ఈ చిత్రంలో శౌర్యకు జోడిగా సిమ్రాన్ పరీన్జ కుదిరినట్టు సినిమా వర్గాల టాక్. శౌర్య సరసన కొత్త అమ్మాయి అయితే సినిమాకు ఫ్రెష్ లుక్ వస్తుందని భావించిన దర్శకుడు శ్రీనివాస్ ఈమెను సంప్రదించారని, ఆమె కూడా కథ, పాత్ర నచ్చి ఓకే చెప్పారని, అయితే ఇంకా అధికారికంగా సైన్ చేయలేదని తెలుస్తోంది. చేసిన మొదటి సినిమా ‘కిరాక్ పార్టీ’ విడుదలకాకముందే ఇలా మరో మంచి ప్రాజెక్టులో ఛాన్స్ దక్కించుకోవడం ఆమె కెరీర్ కు బాగా కలిసొచ్చే అంశమనే అనాలి.


