రామ్ పోతినేని భారీ ప్రాజెక్ట్ లో సింగ్ గీతం బ్యూటీ!?

రామ్ పోతినేని భారీ ప్రాజెక్ట్ లో సింగ్ గీతం బ్యూటీ!?

Published on Jun 22, 2026 11:16 PM IST

మన టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా తన నెక్స్ట్ సినిమాని చాలా గ్రాండ్ గా నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. తన సినిమా కోసం తనే దర్శకునిగా మారి ఓ క్రేజీ సబ్జెక్ట్ ని తను సిద్ధం చేసుకున్నాడు. రీసెంట్ గానే మొదలైన ఈ సినిమా విషయంలో ఇంట్రెస్టింగ్ బజ్ ఇపుడు వినిపిస్తోంది. ఈ సినిమా కోసం హీరోయిన్ గా కోలీవుడ్ బ్యూటీ నివేతా పెతురాజ్ ఫిక్సయినట్టు తెలుస్తోంది.

రీసెంట్ గానే సింగ్ గీతం అనే ప్రయోగాత్మక సినిమాలో కనిపించి ఆమె అలరించింది. సో టాలీవుడ్ లో తనకి మరో బిగ్ ఆఫర్ అని ఇది చెప్పొచ్చు. ఇక దీనికి సంబంధించి అధికారిక క్లారిటీ ఇంకా బయటకి రావాల్సి ఉంది. ఈ సినిమాకి సోదరుడు కృష్ణ పోతినేని నిర్మాణం అందిస్తుండగా ఈ ఏడాది డిసెంబర్ లో సినిమా విడుదల కానుంది.

తాజా వార్తలు