టాలీవుడ్‌లో ఇప్పటికే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ‘సింగ్ గీతం’ చిత్రం ఇప్పుడు కోలీవుడ్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కావడానికి సిద్ధమైంది. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏజీఎస్ సినిమాస్ ఈ చిత్రాన్ని తమిళనాడు వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనుంది. జూన్ 26న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది.
ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు రూపొందించారు. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చాడు. నాగ్ అశ్విన్ నిర్మాతగా వచ్చిన ఈ సినిమాలో అయాన్, అహిల్య బమ్రు, శాలిని కోడెపూడి లీడ్ రోల్స్‌లో నటించారు. నివేదా పేతురాజ్, రాహుల్ రామకృష్ణ, శివన్నారాయణ తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
ఇప్పటికే తెలుగు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో సినిమా పరిశ్రమలో కొత్త జోష్ నింపిన ‘సింగ్ గీతం’, ఇప్పుడు తమిళ ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అయ్యింది. అర్చనా కల్పతి నేతృత్వంలోని ఏజీఎస్ సినిమాస్ ఈ ప్రాజెక్ట్‌ను థియేటర్లలోకి తీసుకువస్తుండటంతో కోలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.



