లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో, నాగ్ అశ్విన్ నిర్మాణంలో వచ్చిన సరికొత్త ప్రయోగాత్మక మ్యూజికల్ ఫాంటసీ చిత్రం ‘సింగ్ గీతం’. థియేటర్లలో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యింది. అయితే, ఈ ఓటీటీ విడుదలపై తాజాగా క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ఈ చిత్రం, తన రిలీజ్ డేట్‌ను ప్రీపోన్ చేసుకుంది.
మొదట ఈ చిత్రాన్ని జూలై 9వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయాలని మేకర్స్ భావించారు. అయితే, తాజాగా ఈ మూవీ ఒక రోజు ముందే, అంటే జూలై 8 నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. జూన్ 12న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేసేందుకు ఈ మూవీ రెడీ అయింది.
అయాన్, అహల్య బమ్రూ, శాలిని కొండేపూడి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వినూత్న చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన స్వరాలు అందించాడు. థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు మరికొద్ది గంటల్లో ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించవచ్చు.


