చిత్ర పరిశ్రమపై ప్రముఖ సింగర్ సంచలన ఆరోపణలు.

Published on Jul 14, 2019 2:09 am IST

ప్రముఖ సింగర్ మరియు సంగీత దర్శకుడైన బాబా సెహగల్‌ హిందీ చిత్ర పరిశ్రమపై తీవ్ర స్థాయిలో వ్యక్తంగా చేశారు. ఓల్డ్ క్లాసిక్ సాంగ్స్ ని నేటి తరం సంగీత దర్శకులు రీమిక్స్‌ చేస్తున్న పద్దతిని ఆయన తప్పుబట్టారు. ఇప్పుడు బాలీవుడ్ లో ఈ సింగర్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తెలుగు చిత్రాలలో కూడా అనేక పాటలు పాడిన ఈ సింగర్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడే.

ఆయన మాట్లాడుతూ ఒకప్పటి ఎవర్ గ్రీన్ సాంగ్స్ రీమిక్స్‌ చేసే పద్ధతిని బాలీవుడ్‌ ఇక ఆపాలి అన్నారు. పరిశ్రమలో ఉన్న కళాకారుల నైపుణ్యాలు సరిగా ఉపయోగిందుకోవాలి కానీ ఒరిజినల్‌ గీతాల్ని నాశనం చేయడం సరికాదు అన్నారు. ఇది బాలీవుడ్‌లా కాకుండా ‘కాపీవుడ్‌’లా తయారైంది. ఒరిజినల్ పాటకు రీమిక్స్ సమకూర్చే క్రమంలో ఆపాట సారాంశం విలువ కోల్పోతుంది. రీమిక్స్ పాటల వలన కళాకారులు కొత్తగా నేర్చుకునేది ఏమిలేదు.మ్యూజిక్ దర్శకులు సాహిత్యం, సంగీత పరికరాలతో ప్రయోగాలు చేయాలి. ఓ హిట్‌ గీతాన్ని రీమేక్‌ చేస్తున్నప్పుడు మనపై ఎన్నో బాధ్యతలు ఉంటాయి. రీమిక్స్‌ పేరుతో పాటను అద్భుతంగా కంపోజ్‌ చేయకపోగా.. ఒరిజినల్‌ కంపోజిషన్‌ను అగౌరవపరుస్తున్నారు’.

సంబంధిత సమాచారం :

More