మెగాస్టార్ సినిమాలో ప్రజా గాయకుడు ?

Published on Aug 29, 2021 9:00 pm IST

దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రానున్న సినిమా ‘గాడ్‌ ఫాదర్‌’. కాగా ఈ సినిమాలో ప్రజా గాయకుడు గద్దర్‌ ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడని, రాబోయే షెడ్యూల్‌లో గద్దర్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే, ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎలాంటి అప్ డేట్ రాలేదు.

కాగా ఈ సినిమాలో హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సీన్స్ మెయిన్ హైలైట్ గా ఉండేలా.. మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా సినిమాని తెరకెక్కించాలని దర్శకడు మోహన్ రాజా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌ లో మార్పులు చేశారట. ‘లూసిఫర్’లో మంజు వార్యర్, హీరోకి చెల్లి పాత్రలో నటించింది.

అయితే మంజు వార్యర్ పాత్రలోనే అనసూయ కనిపించబోతుంది. కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌, ఎన్వీఆర్‌ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :