ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్తితి మరింత క్రిటికల్ గా

Published on Aug 14, 2020 6:08 pm IST

కరోనా వైరస్ భారిన పడి ఇప్పటికే పలువురు ప్రముఖులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అయితే తాజాగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా వైరస్ భారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే. కరోనా లక్షణాలు కలిగి ఉండటం తో ఈ నెల 5 వ తేదీన చెన్నై లోని ఎంజీఎం ఆసుపత్రి లో చేరారు. అయితే ప్రస్తుతం ఐసియూ లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉన్నారు. నిన్న రాత్రి అనగా, గురువారం రాత్రి ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఐసీయూ కి తరలించినట్లు తెలుస్తోంది.

అయితే ఎస్పీ బాలు ఆరోగ్యానికి సంబంధించిన బులిటెన్ ను ఎంజీఎం ఆసుపత్రి విడుదల చేసింది. నిపుణులైన డాక్టర్లు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ను పర్యవేక్షిస్తున్నారు అని అందులో తెలిపారు. ప్రస్తుతం ఐసీయూ లో లైఫ్ సపోర్ట్ తో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అంతేకాక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్తితి మరింత క్రిటికల్ గా ఉంది అని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమ తో పాటుగా, తమిళ్, మలయాళ, వివిధ భాషల్లో ఎస్పీ బాలు కొన్ని వేల పాటలను పాడారు.

సంబంధిత సమాచారం :

More