గాయని సునీత రెండో వివాహం చేసుకోబోతున్నారట ?

గాయని సునీత రెండో వివాహం చేసుకోబోతున్నారట ?

Published on Jul 19, 2018 6:48 PM IST

తెలుగు సినీపరిశ్రమలో తన మధురమైన గానంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు గాయని సునీత. ఆమె గాయనిగానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కూడా ఎంతో పేరుప్రఖ్యాతలు సంపాధించుకున్నారు. కాగా తాజాగా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ అసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే సునీత రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ రూమర్స్ వస్తున్నాయి. కాకపోతే ఆమె ఎవర్ని చేసుకుంటున్నారు ? ఎప్పుడు చేసుకుంటున్నారు ? అనే విషయాల గురించి మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత లేదు.

ఐతే ఈ వార్త పై ఆమె ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఆమె వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న మాట వాస్తవం. గతంలోనే ఓ ఇంటర్వ్యూలో తన రెండో వివాహం గురించి ఆమె మాట్లాడుతూ.. నాకు అసలు రెండో వివాహం ఆలోచన లేదని ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ, సునీత రెండో వివాహం చేసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వార్త పై ఆమె స్వయంగా స్పష్టత ఇస్తే తప్ప , పూర్తి క్లారిటీ రాదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు