‘నీ బాడీ నా ఇష్టం’ అంటే, చూసేవాడి కళ్లు వాడి ఇష్టం – సింగర్ సునీత

‘నీ బాడీ నా ఇష్టం’ అంటే, చూసేవాడి కళ్లు వాడి ఇష్టం – సింగర్ సునీత

Published on Jun 25, 2026 7:59 AM IST

సింగర్ సునీత తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలతో పాటు మహిళల వస్త్రధారణ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సమాజంలో సినిమాని తిడితే, సినిమాలో సమాజాన్ని తిడుతున్నారు.. సమాజం అలా ఉంది కాబట్టే తాము ఇలా సినిమా తీశామని మేకర్స్ చెబుతున్నారని సునీత తెలిపారు. నా దృష్టిలో కమర్షియల్ సినిమా అయినా, ఏ సినిమా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది వాళ్ళ ఇష్టం అనే వాదనపై కూడా సునీత స్పందించింది.

సునీత మాట్లాడుతూ.. “అమ్మాయిలు ‘నా బాడీ నా ఇష్టం’ అంటే, చూసేవాడి కళ్లు వాడి ఇష్టం కదా, మనం ఇందులో ఎవర్ని తప్పు పట్టలేం. ఎవరి ఇష్టం వారిది. నా దృష్టిలో మాత్రం అది అసలు ఫ్రీడమ్ కాదు. పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణ పై కూడా సునీత పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘ఎవరి ఒపీనియన్ వాళ్లది. ఎస్ చెప్పాలన్నా, నో చెప్పాలన్నా మన ఇష్టమే. కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు, నేను జనరల్ గా సొసైటీలో ఉన్న అమ్మాయిల గురించి కూడా మాట్లాతున్నాను. ఇక్కడ ఒక గీత గీయాలంటే, ఫుల్ స్టాప్ పెట్టాలంటే.. బలవంతం ఏమీ లేదు’ అని సునీత తెలిపింది.

తాజా వార్తలు