ఇంట్రెస్టింగ్ ఫోటో షేర్ చేసిన సునీత !

Published on Jun 26, 2021 9:04 pm IST

ప్రముఖ సింగర్ సునీత తన పాటలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆమె రెండో పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఆమె భర్త రామ్‌ వీరపనేని కూడా ఆమెకు పూర్తిగా సహకరిస్తున్నారని, నా భర్త సహకారం వల్లే నేను కెరీర్‌ ను, అటు వ్యక్తిగత జీవితాన్ని కూడా బ్యాలెన్స్‌ చేయగలుగుతున్నాను అని ఆమె చెప్పుకొచ్చింది.

కాగా సునీత తన భర్త రామ్‌ వీరపనేనితో కలిసి ఓ క్యాండిడ్‌ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో బాగా వైరల్ అవుతుంది. ఇక ఈ ఫొటోలో రామ్‌ సునీతకు దేని గురించో వివరిస్తున్నారు. అన్నట్టు సునీత త్వరలోనే పాడుతా తీయగా తరహాలో ఒక సరికొత్త ప్రోగ్రాంతో రానుంది. ఈ ప్రోగ్రాంను కొత్తగా డిజైన్ చేశారట. ఏది ఏమైనా సునీత అభిమానులు ఇలాగే అలరించాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం :