
మోహన్ బాబు తనయుడు, హీరో మంచు విష్ణు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తోన్న ఔట్ అండ్ ఔట్ స్పూఫ్ కామెడీ సినిమా ‘సింగం 123’. ఇప్పటివరకూ నటుడిగా, నిర్మాతగా మాత్రమే తానేంటో నిరూపించుకున్న విష్ణు, ఈ సినిమా కోసం రచయితగా మారడం విశేషం. ‘సింగం 123’ సినిమాకు విష్ణు స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ఇక ఇప్పటికే అన్ని టెక్నికల్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది.
సెన్సార్ బృందం ‘సింగం 123’ సినిమాకు ‘యూ/ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 5న పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమైంది. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సంపూర్ణేష్ బాబు పేరడీ సన్నివేశాలు, డైలాగులు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది. కొత్త దర్శకుడు అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.