సిరివెన్నెల ఆరోగ్యంపై హెల్త్‌ బులెటిన్‌ రిలీజ్..!

Published on Nov 29, 2021 9:16 pm IST


ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈనెల 24న సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ ఆసుపత్రి వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేశారు.

ప్రస్తుతం సిరివెన్నెల ఐసీయూలో ఉన్నారని, ఆయన ఆరోగ్యాన్ని నిపుణులైన వైద్య బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుందని తెలిపారు. అంతేకాదు సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తామని కిమ్స్‌ వైద్యులు తెలియ‌జేశారు.

సంబంధిత సమాచారం :