ఏపీ సీఎం వైఎస్ జగన్ ని సత్కరించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు

Published on Jan 26, 2023 2:38 am IST


టాలీవుడ్ కి చెందిన దిగ్గజ సినీ గేయ రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి 2021, నవంబర్ 30న అనారోగ్య కారణాలతో మృతి చెందిన విషయం తెలిసిందే. వందల సినిమాలకు ఎన్నో గొప్ప గొప్ప పాటలను రచించిన సిరివెన్నెల ప్రస్తుతం భౌతికంగా మన మధ్యన లేనప్పటికీ వారి జ్ఞాపకాలు పాటల రూపంలో మనల్ని ఎల్లప్పుడూ పలకరిస్తూనే ఉంటాయి. అయితే విషయం ఏమిటంటే, నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్ ని తాడేపల్లిలోని ఆయన క్యాంప్‌ కార్యాలయంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కలిసి ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సత్కరించారు.

కాగా సిరివెన్నెల అనారోగ్య సమయంలో వైద్య చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకోవడం, అలానే వారి కుటుంబానికి విశాఖలో ఇంటి స్ధలం మంజూరు చేయడం పై సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను వారు కలిసి కృతజ్ఞతలు తెలిపినట్లు తెలుస్తోంది. అలానే దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో సిరివెన్నెల గారి అనుబంధాన్ని గుర్తుచేసుకుని వాటిని సీఎం జగన్ గారితో వారు పంచుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా నేడు సీఎం జగన్ ని కలిసిన సిరివెన్నెల కుటుంబసభ్యుల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :