‘సీత’కు బిజినెస్ బాగానే జరిగిందా ?

Published on May 14, 2019 11:00 pm IST

బెల్లంకొండ శ్రీనివాస్ – కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తేజ దర్శకత్వంలో ‘సీత’ సినిమా మే 24న రాబోతున్న విషయం తెలిసిందే. ఎప్పటినుంచో ఓ భారీ హిట్ కోసం బాక్సాఫీస్ వద్ద పడి గాపులు కాస్తోన్న బెల్లంకొండకు కనీసం ‘సీత’ అయినా హిట్ ఇస్తోందో లేదో చూడాలి. అయితే ‘సీత’కు బిజినెస్ బాగానే జరిగిన్నట్లు తెలుస్తోంది. దాదాపు 21 కోట్లు పైగానే బిజినెస్ జరిగిందట. ఈ రేంజ్ లో బిజినెస్ జరగడానికి కారణం.. కేవలం హీరోయిన్ కాజల్ మరియు దర్శకుడు తేజానే అని వార్తలు వస్తున్నాయి.

మొత్తానికి బెల్లంకొండ శ్రీనివాస్ కు కాజల్ బాగానే యూజ్ అయింది. ఇక ఈ చిత్రం తేజ దర్శకత్వ శైలిలోనే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా మరియు మంచి భావోద్వేగ సన్నివేశాలతో ఈ సినిమా సాగుతుందని సమాచారం. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ చిత్రంలో కొత్తగా కనిపించనున్నాడట.

ఈ సినిమాలో సోనూసూద్ కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఏ కె ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ పై నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More