‘సీత’ అప్పుడు కూడా రాదా ?

Published on Mar 26, 2019 8:33 am IST

తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ‘సీత’ అనే చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం విడుదల తేదికి సంబంధించి ఏప్రిల్ 25వ తేదీన విడుదల చెయ్యాలని చిత్రబృందం అప్పట్లో
ప్రకటించింది. కానీ ఆ తేదీకి విడుదల అయ్యేలా కనిపించట్లేదు.

ఇక ఈ చిత్రం తేజ దర్శకత్వ శైలిలోనే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా మరియు మంచి భావోద్వేగ సన్నివేశాలతో ఈ సినిమా సాగుతుంది. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ చిత్రంలో కొత్తగా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో సోనూసూద్ కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఏ కె ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ పై నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :