సెన్సార్ పూర్తి చేసుకున్న ‘సీత’ !

Published on May 16, 2019 2:10 pm IST

తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ – కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా రాబోతున్న సినిమా ‘సీత’. కాగా తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ‘U’ సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా మే 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది ఈ చిత్రం.

ఈ సినిమాలో సోనూసూద్ కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఏ కె ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ పై నిర్మిస్తున్నారు.

తేజ దర్శకత్వ శైలిలోనే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా మరియు మంచి భావోద్వేగ సన్నివేశాలతో ఈ సినిమా సాగుతుందని సమాచారం. ఇక ఎప్పటినుంచో ఓ భారీ హిట్ కోసం బాక్సాఫీస్ వద్ద పడి గాపులు కాస్తోన్న బెల్లంకొండకు కనీసం ‘సీత’ అయినా హిట్ ఇస్తోందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

More