సితార ఎంటర్టైన్మెంట్స్ నుండి మరో సినిమా రాబోతోంది !
Published on Mar 7, 2018 1:50 pm IST

సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రస్తుతం రెండు సినిమాలు నిర్మిస్తోంది. అందులో ఒకటి మారుతి దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తోన్న ‘శైలజా రెడ్డి’ సినిమా. ఇందులో రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో కనిపించబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదారాబాద్ పరిసర ప్రాంతాలో జరుగుతోంది. ఈ సినిమాతో పాటు సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా మరొక సినిమా త్వరలోనే మొదలుకానుంది.

ఈ రెండు సినిమాలతో పాటు ఇంకో కొత్త సినిమా ప్రారంభించడానికి రంగం సిద్ధం చేస్తోంది ఈ సంస్థ. వివరాల్లోకి వెళ్ళితే… ‘ఛలో’ సినిమాతో మంచి విజయం సాధించిన దర్శకుడు వెంకి కుడుముల ఈ సినిమాను డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. నితిన్ ఈ సినిమాలో నటించే అవకాశాలున్నాయని సమాచారం. త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

 
Like us on Facebook